సినీ నటి కరాటే కల్యాణిపై సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడం వల్ల కరాటే కల్యాణిపై జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో కరాటే కల్యాణి తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. కరాటే కల్యాణి కి ఈ మైనర్ బాలిక హత్య కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని వివరాలు ఇంకా తెలియలేదు.