నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆద్యంతం లాభాలు ఆర్జింజే అవకాశాన్ని అందజేశాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,849.76 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమై రోజంతా అదే జోరును కొనసాగించి 58,409.30 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 459.50 పాయింట్ల లాభంతో 58,253.82 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,244.50 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,400.80 – 17,238.50 మధ్య కదలాడి చివరకు 150.10 పాయింట్లు లాభపడి 17,354.05 వద్ద స్థిరపడింది.

నేటి సెన్సెక్స్ 30 సూచీలో ఎస్ బి ఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు, మారుతీ, టైటాన్, అల్ట్రా సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిసాయి. పవర్ గ్రిడ్, ఎన్ టి పి సి, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి.