దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్ ను మొదలు పెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద్ద ట్రేడవుతున్నాయి.

ఐడీఎఫ్‌సీ, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, టాటా కమ్యూనికేషన్స్‌, రూపా కంపెనీ, డాలర్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా..ఎన్‌ఎల్‌సీ ఇండియా, ఎన్‌టీపీసీ, ఆయిల్‌ ఇండియా, దిలీప్‌ బుల్డ్‌కాన్‌, పటేల్‌ ఇంజినీరింగ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.