ఏపి రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీపీఎస్సీ దేవదాయ శాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.

60 గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనుంది ఏపీపీఎస్సీ.

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు:
కృష్ణా-50, గుంటూరు-57, ప్రకాశం-56, నెల్లూరు-46, చిత్తూరు-66

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూ.గో-64, ప.గో-48

జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు:
అనంత-63, కర్నూలు-54, కడప-51

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు:
అనంత-2, కర్నూలు-6, కడప-౧

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు:
శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖ-4, తూ.గో-8, ప.గో-7

జిల్లాల వారీగా దేవదాయ శాఖ ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు:
కృష్ణా-6, గుంటూరు-7, ప్రకాశం-6, నెల్లూరు-4, చిత్తూరు-1